Random Video

Telangana Elections 2018 : ఎన్నికల కోడ్ ఉల్లంఘన నేపథ్యంలో కేసులు నమోదు | Oneindia Telugu

2018-11-21 133 Dailymotion

Telangana Chief Electoral Officer Rajat Kumar said, "We have received many complaints against politicians from various parties. An inquiry has been conducted
#TelanganaElections2018
#ElectionCommission
#RajatKumar
#congress
#ElectionCode

అసెంబ్లీ ఎన్నికల కోసం పోటీపడుతున్న అభ్యర్థుల తుది జాబితా గురువారం ప్రకటిస్తామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. రాష్ట్రవ్యాప్తంగా 3,583 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. వీటిని పరిశీలించడంతో పాటు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ వెల్లడిస్తామన్నారు. సచివాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన రజత్ కుమార్ ఎన్నికలకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. కొత్త ఓటర్ల నమోదుకు అనూహ్య స్పందన లభించిందని తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా తరలిస్తున్న 90 కోట్ల రూపాయల విలువైన నగదు, బంగారు ఆభరణాలు, మద్యం సీజ్ చేసినట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.